Page Loader
మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ
రొనాల్డ్ తర్వాత అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ

మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2023
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఫీట్‌ను సాధించాడు. గురువారం పనామాపై అర్జెంటీన్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఈ మైలురాయిని సాధించాడు. తన ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డ్ తర్వాత 800 కెరీర్ గోల్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డిసెంబర్‌లో ఫిఫా ప్రపంచ కప్ 2022 టైటిల్‌ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అర్జెంటీనాకు ఇది తొలి ఔట్ కావడం విశేషం.

లియోనెల్ మెస్సీ

మొదటి స్థానంలో క్రిస్టియానో రొనాల్డ్

అత్యధికంగా కెరీర్ గోల్స్ చేసి క్రిస్టియానో రొనాల్డ్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని తర్వాత స్థానంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ తన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 800 గోల్స్ మార్క్‌ను చేరుకున్నా ఆటగాడిగా నిలిచాడు. క్లబ్‌ల కోసం 701 గోల్స్, అర్జెంటీనా కోసం 99 గోల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రొనాల్డ్ 830 గోల్స్ చేసి, అర్జెంటీనా కెప్టెన్ కంటే ముందున్నాడు. జాతీయ జట్టు పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించనప్పుడు మెస్సీ 120 గోల్స్ నమోదు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోల్ చేసిన లియోనెల్ మెస్సీ