ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, నాదల్
క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు రేసులో పుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ, టెన్నిస్ స్టార్ నాదల్ ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి, గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు. మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె, ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్, పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన మొండో డుప్లాంటిస్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీలు పోటీ పడుతున్నారు. 1999లో స్థాపించిన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేది ఏడాది పొడవునా క్రీడల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులకు గౌరవ సూచికగా అవార్డును అందజేస్తారు.
అత్యధిక సార్లు అవార్డును గెలుచుకున్న ఫెదరర్
నాదల్ జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని సత్తా చాటాడు. విజేతలను మార్చిలో ప్రకటించే అవకాశం ఉంది. నాదల్ పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. టీనేజ్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ 2022లో US ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకోవడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. మాజీ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అత్యధికంగా 6 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహిళా విభాగంలో సెరెనా విలియమ్స్ 5 సార్లు ఎంపికైంది.