LOADING...
Brett Randell: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన కివీస్ పేసర్
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన కివీస్ పేసర్

Brett Randell: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన కివీస్ పేసర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం లేదా బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం వంటి అరుదైన ఘట్టాలు మనం చూసాం. కానీ బ్రెట్ రాండెల్ అనే న్యూజిలాండ్ పేసర్ వాటిని మించిపోయే అద్భుతం చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేస్తూ ఇప్పటివరకు ఎవరూ సాధించని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఫోర్డ్ ట్రోఫీ (లిస్ట్-ఎ టోర్నమెంట్)లో ఈ చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, కాంటర్బరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి రాండెల్ బంతిని అందుకున్నాడు.

Details

పర్ఫెక్ట్ ఓవర్ గా గుర్తింపు

తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను పూర్తిగా కుదిపేస్తూ వరుసగా ఆరు బంతుల్లో ఆరుగురిని పెవిలియన్‌కు పంపాడు. ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఆరు వికెట్లు పడగొట్టడంతో క్రీడా విశ్లేషకులు దీనిని 'పర్ఫెక్ట్ ఓవర్'గా అభివర్ణిస్తున్నారు. దాదాపు 254 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో కొందరు బౌలర్లు ఒక ఓవర్లో ఐదు వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించిన ఘనత మాత్రం ఎవరూ నమోదు చేయలేదు. ఈ అసాధారణ ప్రదర్శనతో బ్రెట్ రాండెల్ పేరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో విస్తృతంగా మారుమోగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement