Loading...
Kagiso Rabada: సెంచూరియన్‌లో రబాడా అరుదైన రికార్డు.. డేల్ స్టెయిన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్!
సెంచూరియన్‌లో రబాడా అరుదైన రికార్డు.. డేల్ స్టెయిన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్!

Kagiso Rabada: సెంచూరియన్‌లో రబాడా అరుదైన రికార్డు.. డేల్ స్టెయిన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో సెంచూరియన్ మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పేసర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వివరాలు

డేల్ స్టెయిన్ రికార్డు బద్దలు

ఇప్పటివరకు ఈ జాబితాలో దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ 59 వికెట్లతో తొలి స్థానంలో ఉండేవాడు.

తాజాగా మూడు వికెట్లు తీయడంతో రబాడ సెంచూరియన్‌లో ఆడిన 10 టెస్టుల్లో మొత్తం 62 వికెట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మరో మాజీ పేసర్ మఖాయ ఎన్తిని 50 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

వివరాలు

వాండరర్స్‌లోనూ అరుదైన ఘనత

ఇదిలా ఉంటే.. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రబాడ అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టాడు.

ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. దీంతో వాండరర్స్ స్టేడియంలో నాలుగోసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఈ క్రమంలో డేల్ స్టెయిన్, మఖాయ ఎన్తిని సరసన నిలిచాడు. ఓవరాల్‌గా రబాడ ఇప్పటివరకు 77 టెస్టులు ఆడి 361 వికెట్లు పడగొట్టాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 40 వికెట్లు సాధించాడు. అంతేకాకుండా ఐదుసార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేయడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు

91 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సఫారీ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది.

ఆ జట్టు బ్యాటర్లలో మహ్‌ఫిజుల్ ఇస్లామ్ (23), తౌహిద్ హృదోయ్ (19), మోమినుల్ హక్ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, మార్కో జాన్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అన్‌రిచ్ నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. వియాన్ ముల్డర్, సిమోన్ హార్మర్ తలో వికెట్ సాధించారు.

ADVERTISEMENT