
MI vs PBKS : అర్జున్ టెండుల్కర్ కి షాక్.. పంజాబ్ తో తలపడే ముంబై జట్టు ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్ తో విజయం తర్వాత ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ రెండు కీలక మార్పులను చేసిన విషయం తెలిసిందే.
జేసన్ బెహ్రండాఫ్ స్థానంలో మెరెడిత్ ను తీసుకోగా.. అర్జున్ స్థానంలో అర్షష్ ఖాన్ ను ఆడించింది. అయితే అర్షద్ ఖాన్ మూడు వికెట్లతో ఫర్వాలేదనిపించినా.. మెరెడిత్ అశించిన స్థాయిలో రాణించలేదు.
ఈ క్రమంలో మెరిడిత్ ను పక్కన పెట్టి బెహ్రండాఫ్ ను ఆడిస్తారొ లేదో వేచి చూడాలి. అయితే బ్యాటింగ్ విభాగంలో ముంబై ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
Details
రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడా?
క్రిస్ జోర్డాన్ కు ముంబై ఒక అవకాశం ఇచ్చి, ఇంపాక్ట్ ప్లేయర్ గా నేహాల్ వధీర్ ను తీసుకోవచ్చు.
ఇక బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ లతో పటిష్టంగా ఉంది. ఇక రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తే జట్టుకు గెలుపు అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.
ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, జోఫ్రా ఆర్చర్, మహమ్మద్ అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, రైలీ మెరెడిత్