కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న కెప్టెన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ ఇప్పటివరకు అయ్యర్ గాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వెన్ను సమస్య కారణంగా గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో కూడా ఆడలేదు. చివరి టెస్టు జరుగుతున్న సమయంలో అతడిని వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం
నాలుగో టెస్టు మూడో రోజు శ్రేయాస్ అయ్యర్ వెన్నుముక కింది భాగంలో నొప్పి ఉందని చెప్పాడని, వెంటనే స్కానింగ్ తీయించామని, ప్రస్తుతం బీసీసీఊ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా మొదటి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఒకవేళ అయ్యర్ కి శస్త్ర చికిత్స చేయించుకుంటే మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంటుంది.