
IPL 2025: ఉత్కంఠంగా ఆరెంజ్ క్యాప్ రేసు.. టాప్ బ్యాటర్ల మధ్య హీట్ ఫైట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీ రోజురోజుకీ ఉత్కంఠ భరితంగా మారుతోంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న స్టార్ ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. పరుగుల వేటలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న బ్యాటర్లు వీరే. ఒక లుక్కేయండి!
పూరన్ టాప్‌లో దూసుకెళ్తున్నాడు
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను ధరిస్తున్నాడు.
ఈ వెస్టిండీస్ ప్లేయర్ ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌ల్లో 357 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ప్రదర్శనలో ఆయన 4 అర్ధశతకాలు బాదాడు. అంతేకాదు అతని స్ట్రైక్ రేట్ 208కి పైగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Details
సాయి సుదర్శన్ సైలెంట్ స్టారే!
గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నారు. 6 ఇన్నింగ్స్‌ల్లో 329 పరుగులు సాధించిన ఆయన 4 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఐపీఎల్‌లో రెండు మూడు సీజన్లుగా తన ఫామ్‌ను మెయింటెయిన్ చేస్తూ ఈసారి కూడా మైమరిపిస్తున్నాడు.
మూడో స్థానంలో మిచెల్ మార్ష్
ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ కూడా లక్నో తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇప్పటి వరకూ 6 ఇన్నింగ్స్‌ల్లో 295 పరుగులు సాధించిన ఈ ఆల్‌రౌండర్ 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అతని ఫామ్‌తో లక్నోకు గట్టి బలంగా మారాడు.
Details
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటి వరకూ 5 ఇన్నింగ్స్‌ల్లో 250 పరుగులు చేసి మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. 208 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడుతున్నాడు.
ఐదో స్థానంలో విరాట్ కోహ్లి
ఆర్సీబీ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ ప్రారంభం నుంచి తన మాజీ ఫామ్‌ను చూపిస్తున్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 248 పరుగులు చేసి మూడు అర్ధశతకాలు సాధించాడు.