ODI World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ.. ఎవరు టైటిల్‌ని నెగ్గుతారో!
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో సెంచరీల మోత మోగించడానికి స్టార్ బ్యాటర్లు సిద్ధమయ్యారు. వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్‌ను సాధించాలని కొందరు మేటి బ్యాటర్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. జట్టుకు టైటిల్ అందించి మేటి బ్యాటర్‌గా ఎవరు నిలుస్తారని క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సచిన్ ఆటకు వీడ్కోలు చెప్పాక ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, స్టీవన్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ పేరు సంపాదించుకున్నారు. వీరిని ఫ్యాబ్-4 అని క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుస్తారు. వీరి హవా మొదలైన కొన్నేళ్ల తర్వాత బాబర్ అజామ్ వెలుగులోకి వచ్చాడు. టోర్నీల్లో వీరి ప్రదర్శన ఆధారంగానే ఆ జట్ల విజయాలు ఆధారపడి ఉన్నాయి.
2023లో ఐదు సెంచరీలను బాదిన విరాట్ కోహ్లీ
క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా విరాట్ కోహ్లీ పేరు సంపాదించాడు. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదేసే కోహ్లీ రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేక ఇబ్బంది పడ్డాడు. కానీ ఏడాది నుంచి అతడి ప్రదర్శన మెరుగుపడింది. 2023లో అతను ఐదు సెంచరీలతో సత్తా చాటాడు. 2011 విజేత జట్టులో కోహ్లీ సభ్యుడిగా కొనసాగాడు. ఇక విరాట్ ఇంకో వరల్డ్ కప్ ఆడతాడా అన్నది సందేహమే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో విరాట్ కోహ్లీపై భారత జట్టు భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్టీవన్ స్మిత్ పై భారీ అంచనాలు
కోహ్లీ లాగే స్టీవన్ స్మిత్ కూడా 2015 ప్రపంచ కప్ విజేత జట్టులో అతను సభ్యుడు. అతడి కెరీర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు బాల్ టాంపరింగ్ కుంభకోణం వల్ల అతడి ప్రతిష్ట దిగజారింది. యాషెస్‌లోనూ అతను జట్టును గెలిపించాడు. వన్డేల్లో అతడి ప్రదర్శన నిరాశపరుస్తోంది. ఈసారి ప్రపంచ కప్‌లో ఉత్తమ ప్రదర్శన చేసి జట్టును గెలిపించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
కేన్ విలియమ్సన్ ఇదే చివరి ప్రపంచ కప్
దేశంలో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కేన్ విలియమ్సన్ కి అభిమానులు ఉన్నారు. టెస్టుల్లోనే కాక వన్డేలోనూ అతను మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకూ ప్రపంచ కప్ టైటిల్ ను నెగ్గలేదు. గత రెండు టోర్నీల్లోనూ న్యూజిలాండ్ జట్టు రన్నరప్ ట్రోఫీకే పరితమైంది. కేన్ ఆడేది ఇదే చివరి ప్రపంచ కప్ కావొచ్చు. ఐపీఎల్‌లో గాయపడి ఒకానొక దశలో ప్రపంచ కప్‌కే అనుమానంగా మారిన కేన్, తర్వాత వేగంగా కోలుకున్నాడు. ఈ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాలి.
వన్డే ప్రపంచ కప్ టైటిల్ పై కన్నేసిన ఇంగ్లండ్
టెస్టుల్లో ఎన్నో గొప్ప రికార్డులను సృష్టించిన జో రూట్ వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతనిపై వేటు పడింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు దూకుడుగా ఆడుతోంది. జో రూట్ కూడా తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. రివర్స్ స్వీప్‌లు, స్కూప్ లో ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాడు. నిలకడగా అన్ని ఫార్మాట్లోనూ జో రూట్ రాణిస్తున్నాడు. ప్రపంచ కప్ లో తనదైన ముద్ర వేసుకోవాలని జో రూట్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న తన జట్టుకు జో రూట్ మరో కప్పు అందిస్తాడో లేదో చూడాలి.
వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా బాబర్ అజామ్
ప్రస్తుతం వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న బాబార్ అజామ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఎక్కువగా సొంతడ్డపై అతను రాణిస్తాడని, అందుకే అతడి సగటు ఎక్కువగా ఉందని విమర్శలు వినపడుతున్నాయి. బౌలింగ్‌కు ఎక్కువ అనుకూలించే పిచ్‌లపై సత్తా చాటలేడని మరోవైపు వాదనలు ఉన్నాయి. అయితే భారత్‌తో ఆడిన అనుభవం లేని బాబర్, ప్రపంచ కప్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. పాకిస్థాన్ జట్టు బాబర్ పై భారీ ఆశలను పెట్టుకుంది. ఈసారీ ఎలాగైనా వన్డే కప్ ట్రోఫీని నెగ్గాలని బాబర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.