Page Loader
Jasprit Bumrah: అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు 
అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు

Jasprit Bumrah: అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒకరు. తన బంతితో బ్యాటర్లకు వణుకు పుట్టించగలడు. చురకత్తుల్లా దూసుకొచ్చ అతని బంతులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎంతో నైపుణ్యం అవసరం. ఇక బుమ్రా యార్కర్ వేశాడంటే వికెట్ తప్పనిసరిగా పడాల్సిందే. అతని బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అతని బౌలింగ్ యాక్షన్‌ను కాఫీ చేయాలని ప్రయత్నిస్తుంటారు.

Details

బుమ్రా యాక్షన్ లో స్కూల్ విద్యార్థిని బౌలింగ్

అయితే ఓ స్కూల్ విద్యార్థిని బుమ్రా యాక్షన్ లో బౌలింగ్ వేయడం ఇప్పుడు అందరిని అకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. బుమ్రా ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తాడో అదే విధంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో పాటు ఆమె స్పీడ్ కూడా అదే తరహాలో ఉండటంతో నెటిజన్లు లేడి బుమ్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు.