Page Loader
ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!
ఫించ్ 2021లో ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు

ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‌మెన్ ఆరోన్‌ఫించ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు.గత సెప్టెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో తొలి T20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు ఫించ్ అందించాడు. టీ20ల్లో రెండుసార్లు 150-ప్లస్ స్కోర్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. టీ20ల్లో వేగంగా 3000 పరుగులు మార్క్‌ను అధిగమించిన తొలి ఆసీస్ ఆటగాడిగా ఫించ్ నిలిచాడు. కేవలం 98 టీ20ల్లో ఈ ఘనతను సాధించిన రెండో ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. కెప్టెన్‌గా అత్యధిక టీ20లు (76) ఆడిన ఆటగాడిగా ఫించ్ రికార్డు సృష్టించాడు. మహేంద్రసింగ్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ (ఒక్కొక్కరు 72 మ్యాచ్‌లు) ఆడి అతని వెనుక ఉన్నారు.

ఫించ్

టీ20 ప్లేయర్ ఆప్ ది అవార్డుకు రెండుసార్లు ఫించ్ ఎంపిక

ఇంగ్లండ్‌పై ఫించ్ ఏడు వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (శ్రీలంకపై ఆరు), అతనికంటే వెనుకంజలో ఉన్నారు. కోహ్లీ శ్రీలంకపై 10 సెంచరీలు చేసిన ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరుపున 17 సెంచరీలు చేసిన ఆటగాడిగా నాల్గవ స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ (29), డేవిడ్ వార్నర్ (19) సెంచరీలు చేశారు. టీ20ల్లో జింబాబ్వేపై అత్యధికంగా 172 పరుగులు చేసి రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో 4వేల పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా ఫించ్ సత్తా చాటాడు. 55 వన్డేలకు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఫించ్ వ్యవహరించి, 31 విజయాలను అందించాడు. ఆస్ట్రేలియా T20I ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2014, 2018లో సొంతం చేసుకున్నాడు.