క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో ఫించ్ కీలక పాత్ర పోషించి ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు. బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం తర్వాత స్టీవ్‌స్మిత్, వార్నర్ కెప్టెన్‌గా నిషేధానికి గురయ్యారు. తర్వాత ఫించ్ 2018లో ఆస్ట్రేలియా వైట్-బాల్ కెప్టెన్ అయ్యాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో రెండుసార్లు 150 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక బ్యాటర్‌గా ఫించ్ నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని, అందుకే రిటైర్మెంట్ ప్రకటించామని ఫించ్ వెల్లడించారు. 2021లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను సాధించామని, ఈ రెండు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని తెలియజేశారు.
55 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఫించ్
టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆస్ట్రేలియా ఆటగాడిగా ఫించ్ నిలిచాడు. 103 మ్యాచ్ ల్లో 3210 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 19 హాప్ సెంచరీలున్నాయి. ఫించ్ 146 వన్డేల్లో 5,406 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి, ఆరోన్ ఫించ్ 55 వన్డేలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 31 మ్యాచ్ లు గెలిచి, 56.36 శాతాన్ని విజయాల శాతాన్ని నమోదు చేశాడు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, తన అభిమానులకు పింఛ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.