Abhishek Sharma: బాబర్, షహీన్‌లకన్నా ముందు వరుసలో అభిషేక్.. పాక్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ పేరు పాకిస్థాన్‌లో గూగుల్ సెర్చ్‌లను షేక్ చేసింది. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత-పాక్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ సత్తా చాటిన తీరు పాకిస్థాన్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. తమ బౌలర్లపై పిడుగులా దాడి చేసిన ఈ తెలుగు యువ బ్యాటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ నెటిజన్లు గూగుల్‌ను బాగా ఆశ్రయించినట్లు బయటపడింది. గూగుల్ విడుదల చేసిన 'మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్ ఇన్ పాకిస్థాన్ 2025' జాబితాలో ఆశ్చర్యకరమైన ఫలితం నమోదైంది.
Details
అభిషేక్ శర్మనే అత్యధికంగా సెర్చ్ చేసినట్లు వెల్లడించిన గూగుల్
పాకిస్థాన్ జట్టు స్టార్‌లు బాబర్ ఆజమ్, షహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లను వెనక్కు నెట్టి, అభిషేక్ శర్మనే అత్యధికంగా సెర్చ్ చేసినట్లు గూగుల్ డేటా తెలియజేస్తోంది. ఆసియా కప్ సూపర్-4 దశలో భారత్-పాక్ పోరులో అభిషేక్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండేలా చేసింది. అప్పట్లో 39 బంతుల్లోనే 74 పరుగులు బాదిన అతను పాకిస్థాన్ బౌలర్లను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. అతని ఆకర్షణీయ ప్రదర్శన, బ్యాటింగ్ స్టైల్ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను గూగుల్‌లో అతని గురించి తెగ వెతికేలా చేసింది.