LOADING...
IPL 2026: అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్‌.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు
అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్‌.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు

IPL 2026: అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్‌.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 11, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విపరీతమైన ఫామ్‌లో ఆడుతూ, పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జట్టు 105 పరుగులు సాధించడం గమనార్హం. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం.

వివరాలు

అద్భుత ఇన్నింగ్స్..

న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి నుంచే దూకుడుగా ఆడిన జట్టు, ముఖ్యంగా అభిషేక్ శర్మ అగ్రెసివ్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కేవలం 22 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లు బాదుతూ 66 పరుగులు చేసిన అభిషేక్ అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 300 ఉండటం అతని వేగాన్ని స్పష్టం చేస్తుంది.

వివరాలు

ఓపెనర్ల హవా సాగిందిలా..

ఇక అతనికి తోడుగా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. 15 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. వీరిద్దరి కలసి ఆడిన విధానం పంజాబ్ బౌలర్లను పూర్తిగా ఇబ్బందులకు గురిచేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ కేవలం 36 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

Advertisement