Page Loader
Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ
దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ

Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
10:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన అతను, పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 40 బంతుల్లోనే శతకం సాధించాడు. ఆరుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అభిషేక్, మరో 11 ఫోర్లు కూడా బాదడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 170కి పైగా పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 70కి పైగా పరుగులు అవసరం. ఇక మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Details

రాణించిన పంజాబ్ బ్యాటర్లు

ప్రియాన్స్ ఆర్యా 36 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 42 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నేహాల్ వధేరా కూడా 27 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ ఈ లక్ష్యాన్ని చేధించాలంటే 246 పరుగులు చేయాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో ఎస్ఆర్‌హెచ్ పేసర్ హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శతకం బాదిన అభిషేక్ శర్మ