Abhishek Sharma: అదరగొట్టిన అభిషేక్ శర్మ..ఐపీఎల్‌లో 5వ సారి 50కి పైగా స్కోర్ నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ అభిషేక్ శర్మ, శుక్రవారం జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2026 67వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టుకు దూకుడైన ఆరంభాన్ని అందించాడు. అతను మొదట ట్రావిస్ హెడ్ తో కలిసి 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అనంతరం ఇషాన్ కిషన్ తో కలిసి 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
వివరాలు
అద్బుత ఇన్నింగ్స్ ఆడాడిలా..
హైదరాబాద్‌లోని తన హోం గ్రౌండ్‌లో అభిషేక్ మరోసారి దూకుడుతో కూడిన అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 254.55గా నమోదైంది. జట్టు స్కోర్ 97/2గా ఉన్న సమయంలో 9వ ఓవర్‌లో అతను అవుట్ అయ్యాడు. అయితే భారీ స్కోర్‌కు పునాది వేసిన కీలక పాత్ర అతనిదే. స్పిన్నర్ సుయేష్ శర్మ అతనిని ఔట్ చేశాడు.
వివరాలు
IPL 2026లో 563 పరుగులు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లలో 43.30 సగటుతో 563 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇది అతని ఐదో 50కి పైగా స్కోర్. ఇందులో ఒక సెంచరీతో పాటు నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అతను మొత్తం 50 ఫోర్లు పూర్తి చేయడంతో పాటు 43 సిక్సర్లు కూడా బాదాడు. మొత్తం IPL కెరీర్‌లో అభిషేక్ 91 మ్యాచ్‌లలో 29.73 సగటుతో 2,379 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు 13 అర్ధసెంచరీలు, 2 సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 171.52 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 144 సిక్సర్లు కొట్టాడు.