LOADING...
SRH: సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?
సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?

SRH: సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ఆసక్తికరమైన ఆఫర్‌ ఇచ్చింది. పన్ను మినహాయింపులు, ఇతర సహాయాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)తో సన్‌రైజర్స్‌కు ఏర్పడ్డ వివాదం నేపథ్యంలో, ఏసీఏ తమ ఆహ్వానం తెలిపింది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖపట్టణంలో నిర్వహించాలని ప్రతిపాదించినట్టు ఏసీఏ వెల్లడించింది.

Details

సమాధానం కోసం ఎదురుచూపులు

ప్రస్తుతం తమ ప్రతిపాదనపై సన్‌రైజర్స్‌ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత పాస్‌ల అంశంపై హెచ్‌సీఏ సన్‌రైజర్స్‌పై తీవ్ర ఒత్తిడి తేవడంతో, ఫ్రాంఛైజీ నగరాన్ని వదిలి వెళ్లే అవకాశాన్ని సైతం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఏసీఏ, సన్‌రైజర్స్‌కు తమ వేదికను అందించేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.