
బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.
ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై సేఠీ.. మా పాకిస్తాన్ సూపర్ లీగ్ క్యాలెండర్ కూడా మీరే ఇవ్వడంటూ జైషాపై మండిపడ్డారు.
ఇప్పటికే ఆసియా కప్ 2023 విషయంలో రెండు క్రికెట్ బోర్డు మధ్య తగదాలున్నాయి. ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో కాకుండా మరో చోటీకి తరలిస్తామని గతంలో జై షా చెప్పాడు. అప్పట్లో దీనిపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని గట్టి హెచ్చరించింది.
జైషా
ఒకే గ్రూపులో ఇండియా-పాకిస్తాన్
2023-24 గానూ ఏసీసీ స్ట్రక్చర్, క్యాలెండర్లను ఏకపక్షంగా ఇస్తున్నందుకు జైషాకు అభినందనలు అని, తమ పీఎస్ ఎల్ స్ట్రక్చర్, క్యాలెండర్ ను కూడా మీరే సమర్పించాలని, దీనిపై త్వరగా స్పందించాలని నజమ్ సేఠీ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ లో భాగంగా ఆసియా కప్ 2023 గురించి గతంలో జైషా మాట్లాడారు. ఈ టోర్ని సెప్టెంబర్ లో జరుగుతుందని, ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉంటాయన్నారు. ఓకే గ్రూపులో ఇండియా, పాకిస్తాన్ ఉంటే 2023లో కనీసం రెండుసార్లు దయాదుల పోరు జరగనుంది.