Page Loader
Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్
హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్

Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్

వ్రాసిన వారు Stalin
Apr 15, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్ (Mumbai Indians)కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్ నెస్ పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన కామెంట్స్ చేశారు. హార్థిక్ పాండ్యా పూర్థిస్థాయిలో ఫిట్ నెస్ తో కనిపించడం లేదని ఆరోపించారు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం రాత్రి వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాండ్యా వేసిన ఆఖరి ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఓవర్ లో మూడు వరుస సిక్స్ లతో సహా 20 పరుగులిచ్చాడు చెన్నై జట్టు గెలుపొందేందుకు దోహదపడ్డాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ముందుగా రెండు వికెట్లు తీసినప్పటికీ పాండ్యా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేక చతికిలపడిపోయాడన్నారు.

Pandya-Gilly

బౌలింగ్​ సాధారణ స్థాయిలోనే ఉంది

ఇక వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే పాండ్యాపై విరుచుకుపడ్డాడు. పాండ్యా బౌలింగ్ తో పాటు అతడి నాయకత్వ లక్షణాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అతడి బౌలింగ్ లో నాణ్యమైన బంతులు విసిరిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ఇదంతా అతడు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ లేకపోవడం వల్లేనని విమర్శించారు. స్పోర్టింగ్ పరిభాషలో చెప్పాలంటే పాండ్యాను ప్రాపీగా గిల్ క్రిస్ట్ అభివర్ణించాడు. పాండ్యా బౌలింగ్ లో వేగంతోపాటు కచ్చితత్వం, నిలకడ పూర్తిగా లోపించిందన్నారు. ఇదంతా చూస్తుంటే పాండ్యా పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ కలిగి లేడని అర్థమవుతుందని గిల్ క్రిస్ట్ చెప్పాడు. అయితే హార్థిక్ లో మెచ్చుకోవాల్సి న అంశం ఏమిటంటే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు.

Ipl-Cricket

బౌలింగ్​ లయ తప్పింది: గిల్​ క్రిస్ట్​ 

అతడి బౌలింగ్ ప్రస్తుతం లయ తప్పిందని చెప్పారు. హార్థిక్ పాండ్యా టాస్ గెలవగానే ఎటువంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయమేనని తెలిపారు. అంజిక్యా రెహానేను గెరాల్డ్ కోయెడ్జీ తొందరగానే ఔట్ చేయడం అందుకు నిదర్శనమన్నారు. పాండ్యా ఆఖరి ఓవర్లో ఇచ్చి ఆ 20 పరుగులే మ్యాచ్ ను ఓడిపోయేందుకు కారణమయ్యాయని తెలిపారు.