కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..!
టీమిండియా జెర్సీ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరోప్ బ్రాండ్ అడిదాస్ రూపొందించనున్న కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. 2016, 2020 మధ్య కాలంలో నైకీ టీమిండియా కిట్ స్పాన్సర్ గా వ్యవహరించింది. ఇక నాలుగేళ్ల కాలానికి గానూ ఎంపీఎల్370 కోట్ల ఒప్పందంతో టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా ఉంది. కేకేసీఎల్ ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్ అడిడాస్‌తో పనిచేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలిసింది.
ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా అడిడాస్..!
ఈ క్రమంలో జూన్ 1 నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూన్ 7 నుండి జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ సేన అడిడాస్ జెర్సీలో కనిపించనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు అడిడాస్ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌లతో అడిడాస్‌కు గతంలో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే