LOADING...
IND VS AFG: భారత బౌలర్ల దెబ్బకు చిత్తు.. కుప్పకూలే దిశగా అప్గాన్ జట్టు
భారత బౌలర్ల దెబ్బకు చిత్తు.. కుప్పకూలే దిశగా అప్గాన్ జట్టు

IND VS AFG: భారత బౌలర్ల దెబ్బకు చిత్తు.. కుప్పకూలే దిశగా అప్గాన్ జట్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభంలో 368/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన భారత జట్టు 564/8 వద్ద తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ జట్టు భారత బౌలింగ్ ముందు తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. రహమత్ షా 43* పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడే జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో అబ్దుల్ మాలిక్ (16), సెదిఖుల్లా అటల్(17), రహ్మనుల్లా గుర్బాజ్ (12), హస్మతుల్లా షాహిది (20), అఫ్సర్ జజాయ్ (3) పరుగులకే పెవిలియన్ చేరారు.

వివరాలు

451 పరుగుల వెనుకంజలో అప్గాన్ జట్టు

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు సాధించారు. అఫ్గానిస్థాన్ ఇంకా 451 పరుగుల వెనుకబాటులో ఉంది. ఇంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 126 పరుగులు చేసి అవుటయ్యాడు. రిషభ్ పంత్ 81 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ (19), మానవ్ సుతార్ (28), మహ్మద్ సిరాజ్ (22), కుల్‌దీప్ యాదవ్ (9) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలింగ్‌లో మహ్మద్ సలీమ్ సఫీ అద్భుతంగా రాణించి 6 వికెట్లు తీశాడు. రెహమాన్ షరీఫీ, హస్మతుల్లా షాహిది తలో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement