SA Vs AFG : టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభ కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ బెర్త్ పై ఆశ చావని ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచులో శక్తివంచన లేకుండా పోరాడాలని భావిస్తోంది. ఈ జట్టు సెమీస్ చేరడం ఆసాధ్యం అని కూడా చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో 438 పరుగుల తేడాతో గెలిస్తేనే ఆప్ఘనిస్తాన్ సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న సౌతాఫ్రికా ఈ మ్యాచులో కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సేమ్ జట్టుతో బరిలోకి దిగుతుండగా, సౌతాఫ్రికా ఒక మార్పును చేసింది.
ఇరు జట్లలోని సభ్యులు
దక్షిణాఫ్రికా జట్టు క్వింటన్ డి కాక్ (w), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి ఆఫ్ఘనిస్తాన్ జట్టు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(w), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హ