Page Loader
Rohit Sharma dance: రోహిత్​, సూర్యకుమార్ తీన్మార్​ డ్యాన్స్​ - డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు! 
Rohit Sharma dance: రోహిత్​, సూర్యకుమార్ తీన్మార్​ డ్యాన్స్​ - డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు!

Rohit Sharma dance: రోహిత్​, సూర్యకుమార్ తీన్మార్​ డ్యాన్స్​ - డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు! 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2024
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా టీమ్​ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్​ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ప్లేయర్లంతా దిల్లీ ఎయిర్ పోర్ట్​కు చేరుకున్నారు. విశ్వ వేదికపై భారత్​ను విజేతగా నిలిపిన ఛాంపియన్లకు ఎయిర్​పోర్టు బయట ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక బస్సులో భారత జట్టు ఆటగాళ్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. దారి మధ్యలో ఫ్యాన్స్​ టీమ్​ఇండియా ప్లేయర్స్​ను చూసేందుకు ఎగబడ్డారు. కెమెరాలతో వారిని బంధించారు. ప్లేయర్స్​కు కూడా వారి అభివాదం తెలుపుతూ ఫ్యాన్స్​లో జోష్​ నింపారు.

రోహిత్

ప్లేయర్లను గ్రాండ్​ వెల్​కమ్ 

ఇక హోటల్ దగ్గర కూడా ప్లేయర్లను గ్రాండ్​ వెల్​కమ్ దక్కింది. ప్లేయర్లందరికీ స్వాగతం పలికేందుకు హోటల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు. బ్యాండ్ చప్పుళ్లతో టీమ్ఇండియాకు స్వాగతం పలికింది. అయితే స్వాగతం పలుకుతున్నప్పుడు కొట్టిన ఢోలు విని కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఊగిపోయారు. విజయోత్సాహంతో అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. అక్కడి డ్యాన్సర్లతో కలిసి చిందులేశారు. హార్దిక్ పాండ్య, విరాట్​ కోహ్లీ కూడా ఆ డప్పులను వింటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టీమ్​ఇండియా మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్యాన్స్ వేస్తున్న రోహిత్ శర్మ