Asia Hockey Champions Trophy 2024: ఫైనల్‌లో చైనాను ఓడించిన భారత్.. ఐదోసారి టైటిల్ కైవసం
భారత పురుషుల హకీ జట్టు మంగళవారం ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 1-0తో చైనాను మట్టికరిపించింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ ఏకైక గోల్ సాధించాడు. ఈ ఆసియా హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఐదోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి క్వార్టర్‌లో నీలకంఠ రైట్ ఎండ్ నుంచి మంచి ప్రయత్నం చేసినా చైనా గోల్ కీపర్ వాంగ్ వీహావో విఫలమయ్యాడు. ఈ క్రమంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయలేకపోయాడు.
మూడుసార్లు విజేతగా నిలిచిన పాకిస్థాన్
తొలి రెండు క్వార్టర్స్‌లో డిఫెన్స్‌లో అద్భుతాలు చేసిన చైనా జట్టు.. ఫార్వర్డ్‌లోనూ చక్కటి ప్రయత్నాలు చేసింది. మ్యాచ్ చివరి క్వార్టర్ సమయంలో భారత ఆటగాడు జుగ్రాజ్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. భారత జట్టు 2023, 2018 (ఉమ్మడి విజేతలు), 2016, 2011లో విజేతలుగా నిలిచింది. భారత్ తర్వాత పాకిస్థాన్ హాకీ జట్టు 3 సార్లు, దక్షిణ కొరియా 1 సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి.