LOADING...
Salman Agha: ఇండో-పాక్ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆఘా షాకింగ్ కామెంట్స్
ఇండో-పాక్ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆఘా షాకింగ్ కామెంట్స్

Salman Agha: ఇండో-పాక్ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆఘా షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
May 02, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది జరిగిన ఆసియా కప్ సందర్భంగా భారత, పాకిస్థాన్ కెప్టెన్లు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా సల్మాన్ ఆఘా మరికొన్ని వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించిందని చెప్పారు. అయితే ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం నిర్వహించిన ఫోటోషూట్ సమయంలో మాత్రం కెప్టెన్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని అంశాలపై కూడా స్పందించారు.

వివరాలు

టాస్‌కు కొద్ది క్షణాల ముందు..

ఇండో-పాక్ మ్యాచ్ రోజున టాస్‌కు కొద్ది క్షణాల ముందు మాత్రమే కరచాలనం గురించి సమాచారం తనకు అందిందని ఆఘా పేర్కొన్నారు. మీడియా మేనేజర్ నయీమ్‌తో కలిసి టాస్‌కు వెళ్లినప్పుడు మ్యాచ్ రిఫరీ తనను పక్కకు పిలిచి కరచాలనం ఉండదని తెలిపాడని అన్నారు. కరచాలనం లేకపోయినా పెద్దగా పట్టించుకోలేదని, ఆ విషయంలో తాను ఎక్కువగా ఆలోచించలేదని చెప్పారు. కరచాలనం జరగదన్న విషయం తొలిసారిగా మ్యాచ్ రిఫరీ ద్వారానే తెలిసిందని వివరించారు.

వివరాలు

అలా జరగడం బాధాకరం..

అయితే టాస్ సమయంలో కరచాలనం జరగకపోయినా మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ఉంటుందని భావించానని ఆయన చెప్పారు. మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులందరం కలిసి భారత ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లామని, అయితే అక్కడ తలుపులు మూసి ఉండటం గమనించామని తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద కూడా భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదని అన్నారు. ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురుపడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగిందని ఆఘా పేర్కొన్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో:

Advertisement