Page Loader
Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్
'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్

Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైన విషయం అందరికి తెలిసిందే. లీగ్ దశ నుంచి వరుస విజయాలు సాధించిన భారత్, అటు కీలకమైన ఫైనల్ మ్యాచులో మాత్రం తడబడింది. భారత్ ఓటమితో పాక్ మాజీ ప్లేయర్లు తమ వక్రబుద్ధుని చాటుకున్నారు. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్, మరోసారి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. టీమిండియా పరాజయంతో క్రికెట్ గెలిచిందని, భారత జట్టు ఓడిపోయి మంచి పనైందని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డాడు.

Details

భారత్ ఓడిపోవడం మంచి పరిణామం : రజాక్

ఒకవేళ భారత్ ప్రపంచ కప్ గెలిచి ఉంటే క్రికెట్‌కు అది చాలా బాధాకరమైన క్షణంగా మిగిలేదని రజాక్ పేర్కొన్నాడు. ఎందుకంటే మ్యాచుకు ముందే టీమిండియా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుందని పేర్కొన్నాడు. ఐసీసీ ఫైనల్‌కు ఇలాంటి చెత్త పిచ్‌ను ఉపయోగించడం తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. భారత్ ఓడిపోవడం మంచి పరిణామం అని రజాక్ చెప్పాడు.