Page Loader
AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు 
మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి

AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు 

వ్రాసిన వారు Stalin
Mar 30, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF)ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఫుడ్ తయారీ విషయంలో ఆగ్రహానికి గురైన దీపక్ తమపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 'తమ డిన్నర్ పూర్తైన తర్వాత..గుడ్లు ఉడకపెట్టుకునేందుకు తమ రూమ్ కి వెళ్లడంతో ఆగ్రహానికి గురైన ఆయన మా గదిలోకి వచ్చి మాపై భౌతిక దాడికి పాల్పడ్డారు'అని ఆరోపించారు. అయితే, ఆ సమయంలో శర్మ తాగిన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇద్దరు ప్లేయర్లు, AIFFకి ఫిర్యాదు చేశారు.దీంతో AIFF అతనిపై విచారణకు హామీ ఇచ్చింది. ఇండియన్‌ విమెన్‌ లీగ్‌లో భాగంగా ఖాద్‌ బృందం ప్రస్తుతం గోవాలో ఉంది.

Details 

ఘటనపై స్పందించిన వాలంకా అలెమావో

గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు క్రీడాకారుల భద్రతపై రాతపూర్వక హామీ ఇచ్చారు. అలాగే దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్ (AIFF) విమెన్‌ ఫుట్‌బాల్ కమిటీ ఛైర్‌పర్సన్ వాలంకా అలెమావో స్పందించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 'ఆ ఫిర్యాదు కాపీ నా దృష్టికి వచ్చింది. అలాంటి ఘటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్ తగిన చర్యలు తీసుకుటుంది' అని వాలంకా వెల్లడించారు.