Loading...
Ajinkya rahane: క్రీజ్‌ను వదిలి కామెంటరీ బాక్స్‌లోకి.. రహానే కొత్త అవతారం
క్రీజ్‌ను వదిలి కామెంటరీ బాక్స్‌లోకి.. రహానే కొత్త అవతారం

Ajinkya rahane: క్రీజ్‌ను వదిలి కామెంటరీ బాక్స్‌లోకి.. రహానే కొత్త అవతారం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇన్నాళ్లు బ్యాట్‌తో క్రీజ్‌లో పరుగులు సాధించిన ఈ స్టార్ క్రికెటర్.. ఇకపై కామెంటరీ బాక్స్‌లో తన గళం వినిపించనున్నాడు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌తో రహానే వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ఇటీవలే రహానే వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల రహానే ఇక ఆటను మరో కోణంలో విశ్లేషించనున్నాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌కు రహానే కామెంటరీ ప్యానెల్‌లో చేరాడు.

వివరాలు

క్రికెట్‌లో అపార అనుభవం..

భారత్ తరఫున 85 టెస్టులు ఆడిన రహానే.. 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో మొత్తం 5,077 పరుగులు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఉన్న అపార అనుభవం.. అభిమానులకు మ్యాచ్‌ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

తన కొత్త బాధ్యతపై రహానే స్పందించాడు. "టెస్ట్ క్రికెట్ అత్యున్నతమైనది.

ఇన్నాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత.. ఇప్పుడు ఆటను మరో కోణం నుంచి చూడటం గౌరవంగా భావిస్తున్నాను.

ఆటలోని వ్యూహాలు, కీలకమైన క్షణాలను వారికి వివరించేందుకు ప్రయత్నిస్తాను" అని రహానే పేర్కొన్నాడు.

రహానే కామెంటరీ ప్యానెల్‌లో చేరడం తమ ప్రసారాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా బిజినెస్ హెడ్ రాజేశ్ కౌల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT