వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. చేతన్ శర్మ రాజీమానా చేయడంతో ఇటీవల టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను అహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన అడ్వైజరీ కమిటీ అజిత్ అగార్కర్‌కు ఛాన్స్ ఇచ్చింది. టీమిండియా సెలెక్టర్ల ప్యానల్‌లో ఇప్పటివకే శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ సభ్యులుగా ఉన్నారు. అజిత్ అగార్కర్ ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే ఈసారి అతనికి ఈ పదవి వరించడం ఖాయమన్న వార్తలు వినిపించాయి.
టీమిండియా తరుపున 191 వన్డేలు ఆడిన అగార్కర్
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు టీ-20ల సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనుంది. 2017-2019 మధ్యలో ముంబై జట్టు సెలెక్టర్‌గా అతను పనిచేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ గా పని చేసినా, ఈ మధ్యే దాని నుంచి తప్పుకున్నాడు ఇండియా తరఫున వన్డేల్లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అగార్కర్ పేరిట ఉంది. టీమిండియా తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు అగార్కర్ ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ అతడు ఉన్నాడు. 2000 నుంచి 2010 మధ్య టీమిండియాలో కీలక ఆటగాడిగా అగార్కర్ కొనసాగిన విషయం తెలిసిందే.