Loading...
Ajit agarkar: అజిత్ అగార్కర్‌కు ఉద్వాసన తప్పదా? సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం?
అజిత్ అగార్కర్‌కు ఉద్వాసన తప్పదా? సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం?

Ajit agarkar: అజిత్ అగార్కర్‌కు ఉద్వాసన తప్పదా? సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 05, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో భారత మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రోహిత్ శర్మరోహిత్ శర్మ భవిష్యత్తుకు సంబంధించిన పరిణామాలు కూడా ఈ మార్పు చర్చలకు మరింత ఊతమిచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ పదవీకాలం జూన్ 2026తో ముగియగా, బీసీసీఐ మరో మూడు నెలల పాటు ఆయన ఒప్పందాన్ని పొడిగించింది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనే ప్రధాన ఎంపిక కమిటీకి నాయకత్వం వహిస్తారనే ప్రచారం సాగింది.

వివరాలు

ప్రధాన కోచ్ పై చర్చలు..

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించే దిశగా బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రోహిత్ శర్మ కెరీర్‌లో చివరిదిగా నిలుస్తుందనే ప్రచారం ముందుగా జోరుగా సాగింది.

ఆ తర్వాతి సిరీస్‌లకు అతడిని జట్టులో నుంచి తప్పించే అంశంపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని జట్టు యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి.

వివరాలు

అజిత్ అగార్కర్‌తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదనే వార్తలు..

అంతలోనే లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ అద్భుత శతకం సాధించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

దీంతో ఎంపిక కమిటీపై మరింత ఒత్తిడి పెరిగిందని ప్రచారం జరిగింది.

లార్డ్స్ వన్డే ముగిసిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, రోహిత్ శర్మ ఇంకా భారత జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలక భాగమేనని స్పష్టం చేశారు.

అతడు మరికొంతకాలం టీమిండియా తరఫున ఆడతాడని వెల్లడించారు.

ఈ ప్రకటనకు ముందు అజిత్ అగార్కర్‌తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదనే వార్తలు కూడా వినిపించాయి.

ADVERTISEMENT