లక్నోకు ముచ్చెటమలు పట్టించిన ఆకాష్ మధ్వల్.. 15 బంతుల్లో 5 వికెట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచులో ఉత్తరాఖండ్ కు చెందిన ఆకాష్ మధ్వల్(3.3-0-5-5) మెరుపు బౌలింగ్ కు లక్నో బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత చెలరేగింది. వరుస విజయాలతో ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 5 వికెట్లతో రాణించిన ఆకాష్ మధ్వల్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. నాలుగు సంవత్సరాల పాటు సాధారణ బాల్(లెదర్ బాల్)తో క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆకాష్ చైన్నై స్టేడియంలో మాత్రం విజృంభించాడు.
ఆకాష్ మధ్వల్ బౌలింగ్ అద్భుతం : రోహిత్ శర్మ
2019 లో మధ్వల్ అప్పటి ఉత్తరాఖండ్ కోచ్ వసీం జాఫర్, ప్రస్తుత కోచ్ మనీష్ ఝా దృష్టిని ఆకర్షించాడు. మధ్వల్ ఢిల్లీకి వెళ్లడానికి ముందు క్రికెట్ కోచ్ అయిన అవతార్ సింగ్ వద్ద శిక్షణ పొంది రాటుతేలాడు. ఫ్లే ఆఫ్స్ 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఆకాష్ నిలిచాడు. మలింగ, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్లు కూడా ఈ ఫీట్ ను అందుకోలేకపోవడం గమనార్హం. ఆకాష్ కంటే ముందు అనిల్ కుంబ్లే కూడా 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఆకాష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన యువ ఆటగాళ్లు టీమిండియాకు అడుతున్నారని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించారు.