రెండో రౌండ్‌కు చేరుకున్న అలెగ్జాండర్ జ్వెరవ్
జర్మనీ స్టార్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. జువాన్ పాబ్లో వరిల్లాస్‌ను ఐదు సెట్లలో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగు గంటల ఆరు నిమిషాల్లో ప్రపంచ 103వ ర్యాంకర్‌ను 4-6, 6-1, 5-7, 7-6(3), 6-4తో అధిగమించాడు. జ్వెరెవ్ ఈ సీజన్‌లో తన మొదటి టూర్-లెవల్ విజయాన్ని సాధించాడు. జ్వెరవ్ గాయం నుండి కోలుకొని యునైటెడ్ కప్‌లోకి తిరిగొచ్చి సత్తా చాటాడు. జ్వెరెవ్ 173 పాయింట్లు సాధించగా, పాబ్లో వరిల్లాస్ గతంలో కంటే 23 తక్కువ పాయింట్లతోనే వెనుతిరిగాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సాధించగా.. పాబ్లో వరిల్లాస్ 15తోనే స్థిరపడ్డాడు. జ్వెరెవ్ ఈ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన సర్వీస్‌ను (214 KPH)నమోదు చేశాడు.
20వ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జ్వెరెవ్ విజయం
రాఫెల్ నాదల్ తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ-ఫైనల్ మధ్యలోనే జ్వెరెవ్ గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. అనంతరం కోర్టు నుంచి వీల్‌ఛైర్‌లో వెళ్లిపోయారు. జ్వెరెవ్ 2022లో 29-10తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు. అయితే ఆ సీజన్లో టైటిల్‌ను గెలవలేకపోయాడు. అయితే జ్వెరెవ్ తన 20వ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం సాధించాడు. ఈ టోర్నెమెంట్లో కేవలం రెండుసార్లు మాత్రమే క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్నాడు 2020లో సెమీస్, 2021లో క్వార్టర్-ఫైనల్, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాల్గవ రౌండ్‌లో వెనుతిరిగాడు.