World Cup 2023 : భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక క్రికెట్ బోర్డులో కొత్త సభ్యులను నియమించిన క్రీడా మంత్రి
వన్డే వరల్డ్ కప్ 2023 లో శ్రీలంక జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్ బోర్డుపై పడింది. భారత్ చేతిలో 55 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డులోని సభ్యులందరిని తొలగించి, వారి స్థానంలో కొత్త సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1996 ప్రపంచకప్‌ను గెలుచుకున్న దేశ సారథి అర్జున రణతుంగను కొత్త తాత్కాలిక బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు రణసింగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఏర్పడిన ఏడుగురు సభ్యుల ప్యానెల్‌లో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛదంగా రాజీమానా చేయాలన్న క్రీడా మంత్రి
గత వారం భారత్‌పై శ్రీలంక 302 పరుగుల తేడాతో చిత్తు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ అధికారులకు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, వారు స్వచ్ఛందంగా రాజీమానా చేయాలని రణసింగ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘోర పరాభావంపై ఎల్ఎల్‌సీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కోచింగ్ స్టాప్, సెలెక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఓటమిగల కారణాలు, ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు ఎంపికపై వివరాలను ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా, ప్రపంచకప్‌లో శ్రీలంక ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న ఆ జట్టుకు సెమీస్ దారులు మూసుకుపోయాయి.