మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..?
ఐపీఎల్ వేలానికి టైమ్ దగ్గర పడింది. రేపు ఈ మినీ వేలం జరగనుంది. 16వ ఎడిషన్ ఐపీఎల్ కోసం ఈసారి మినీ వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు వేలంలోపాల్గొనున్నాయి. ఆటగాళ్ల వేలం కోసం జట్లు కొచ్చిలోని పిట్‌స్టాప్‌లో సమావేశమవుతాయి. ఈ సారి వేలంలో పాల్గొనేందుకు మొత్తం 991 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నా.. అందులో నుంచి 405 మందిని ఫ్రాంఛైజీలు ఫైనల్ చేశాయి. అయితే వీళ్ల నుంచి గరిష్ఠంగా 87 మంది ప్లేయర్స్‌ను మాత్రమే ఫ్రాంఛైజీలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 మంది విదేశీ ప్లేయర్స్ ఉండొచ్చు. ఇక వేలంలో పాల్గొనే వాళ్లలో మొత్తం 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
ఏం టీం దగ్గర ఎంత ఉంది అంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ - రూ.20.45 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్ - రూ.19.25 కోట్లు కేకేఆర్ - రూ.7.05 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ - రూ.23.35 కోట్లు ముంబై ఇండియన్స్ - రూ.20.55 కోట్లు పంజాబ్ కింగ్స్ - రూ.32.2 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.8.75 కోట్లు రాజస్థాన్ రాయల్స్ - రూ.13.2 కోట్లు హైదరాబాద్ - రూ.42.25 కోట్లు 2018లో రిచర్డ్ మాడ్లీ నుండి బాధ్యతలు స్వీకరించిన హ్యూ ఎడ్మీడ్స్ వేలంపాటదారుగా ఉంటాడు. చివరిసారిగా మెగా వేలం 1వ రోజున ఎడ్మీడ్స్ మధ్యలోనే కుప్పకూలాడు, ఆ తర్వాత అతని స్థానంలో చారు శర్మను నియమించారు.