Page Loader
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న అలిస్సా హీలీ
ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయాన్ని అందించిన హీలీ

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న అలిస్సా హీలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం జరగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలిస్సా హీలీ సూపర్ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అలిస్సా హీలీ 36 బంతుల్లో 37 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో హీలీ మహిళల T20Iలలో అత్యధిక పరుగులు చేసిన 10వ ప్లేయర్ గా రికార్డుకెక్కింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ (2) వికెట్ కోల్పియింది. కెప్టెన్ మెగ్ లానింగ్‌తో, హీలీ జత కట్టి రెండో 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అలిస్సాహీలీ

అలిస్సాహీలీ సాధించిన రికార్డులివే

హీలీ 138 గేమ్‌లలో 23.92 సగటుతో 2,392 పరుగులు చేసింది. ఇందులో 13 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. ఆస్ట్రేలియన్ ప్లేయర్ల్స్ లో లానింగ్ 3,345 పరుగులు చేసి, టీ20 అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచింది. లానింగ్‌ కంటే సుజీ బేట్స్ (3,683), స్టాఫానీ టేలర్ (3,124), సోఫీ డివైన్ (2,966), హర్మన్‌ప్రీత్ కౌర్ (2,956) పరుగులు చేసి ముందు ఉన్నారు. ఉమెన్స్ టీ20ల్లో 2,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇద్దరు కీపర్లలో హీలీ ఒకరు. ఆమె 123 మ్యాచ్‌ల్లో 2,094 పరుగులు చేసింది.