ICC మహిళల T20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుతోంది. బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. దీంతో గ్రూప్ A స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆగ్రస్థానానికి చేరుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ అజేయంగా 48 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. జికెబెర్హాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ టపాటపా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ 57 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన 107/7 స్కోరు చేసింది.
లానింగ్ సాధించిన రికార్డులివే
లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా మొదట్లోనే బెత్ మూనీ (2) వికెట్ కోల్పోయింది. అయితే అలిస్సా హీలీ (37), లానింగ్ (48*), ఆష్లీ గార్డనర్ (19*) రాణించడంతో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలోనే స్కోరును చేధించింది. లానింగ్ ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 48 పరుగులు చేసింది. మొత్తం 31 మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేసింది. 932 పరుగులతో WT20Iలలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పటివరకూ 128 టీ20లు ఆడి 3345 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు చేసింది.