Page Loader
ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి
SA మహిళల చేతిలో ఓడిపోయిన భారత్ మహిళలు

ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా మహిళలు దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు పేలవ ప్రదర్శనతో ఫైనల్లో చతికిలపడ్డాడరు. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో సౌతాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు. గురువారం జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులను మాత్రమే చేశారు. ఎనిమిది బంతులాడి స్మృతి మంధాన (0) డకౌట్‌ కాగా, మరో ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (11) బ్యాటింగ్ లో విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ 48 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

ట్రయాన్

32 బంతుల్లో 57 పరుగులు చేసిన ట్రయాన్

SA బౌలర్లు మెరుగ్గా రాణించడంతో భారత్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. నాంకులులేకో మ్లాబా 2/16, కెప్టెన్ సునే లూస్ 1/22తో రాణించింది. హర్లీన్ 56 బంతుల్లో నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేసింది. ఆమె ప్రస్తుతం 17.50 సగటుతో 245 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు చేసింది. దీప్తి శర్మ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రయాన్ 32 బంతుల్లో 57* పరుగులు సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 20.80 సగటుతో 957 పరుగులు చేసింది. అనంతరం ఆమెకు ప్లేయర్ ఆప్ ధ మ్యాచ్ గా నిలిచింది.