Women's Under 19 T20 World Cup ఫైనల్లో ఇండియా
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్తును ఇండియా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ జార్జియా ప్లిమ్మర్ 35 పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియానికి క్యూ కట్టారు. టీమిండియా ఓపెనర్ శ్వేతా సెహ్రాతవ్ 61 పరుగులు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న పర్వావి
ఇండియా బౌలర్లలో పర్వావి 3 వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. టైటస్ సాధు, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలా ఒక వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్ పెఫాలి శర్మ (10) తర్వగా ఔటైనా.. మరో ఓపెనర్ సెహ్రావత్ హాప్ సెంచరీ చేసింది. అండర్ 19 మహిళలకు ఇదే తొలి వరల్డ్ కప్ కాగా.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇండియా నిలిచింది జనవరి 29న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.