Page Loader
దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ
అలిస్సా హీలీ ఐదు టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది

దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2023
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంపికైంది. ఈ మేరకు యూపీ వారియర్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మను రూ.2 కోట్ల 60లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. ఆసీస్ వికెట్ కపీర్ అలిస్సా హీలిని రూ.70 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసింది. యూపీ వారియర్స్ టీమ్‌‌కి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని అనుకున్నారంతా.. అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలిస్సా హీలీని కెప్టెన్‌గా యూపీ వారియర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ఎంచుకుంది డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 3న గుజరాత్ జెయింట్స్‌, యూపీ వారియర్స్ తలపడనున్నాయి.

ఉమెన్ ఐపీఎల్

యూపీ వారియర్స్ జట్టు సభ్యులు

హీలీ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఇటీవల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను 4-1తో ఓడించిన విషయం తెలిసిందే. ఆమె మహిళల బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా హీలీ నిలిచింది. యూపీ వారియర్స్ 16 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో 10మంది టీమిండియా ప్లేయర్లు, ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. యూపీ వారియర్స్ జట్టు: సోఫీఎక్లెస్టోన్, దీప్తిశర్మ, తహ్లియామెక్‌గ్రాత్, షబ్నిమ్ఇస్మాయిల్, అలిస్సాహీలీ, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతాషెరావత్, యశశ్రీ, నవ్‌గిరే, గ్రేస్‌హారిస్, దేవికా, లారెన్ సిమ్‌రవీక్, లారెన్ చోవిక్, లారెన్ బెల్