ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐర్లాండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది.
అందుకు బదులుగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లను కోల్పోయి 704 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఇద్దరు శ్రీలంక బ్యాటర్లు డబుల్ సెంచరీ చేయగా.. మరో ఇద్దరు సెంచరీలతో విజృంభించారు.
రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ నాలుగో సెంచరీ చేయడం విశేషం.
Details
లంక గడ్డపై ఏడు సెంచరీలు బాదిన మాథ్యూస్
ఓపెనర్ నిషాన్ మధుష్క 205, కుశాల్ మెండిస్ 245, కరుణ రత్నే 115, ఏంజెలో మాథ్యూస్ 100 పరుగులతో చెలరేగారు. 104వ మ్యాచ్‌ను ఆడుతున్న మాథ్యూస్ 45.39 సగటుతో 7,218 పరుగులకు చేరుకున్నాడు. టెస్టులో అతనికి ఇది 15వ సెంచరీ కావడం విశేషం.
మాథ్యూస్ ఇప్పుడు పరుగుల పరంగా క్రిస్ గేల్ (7,214), సౌరవ్ గంగూలీ (7,212), స్టీఫెన్ ఫ్లెమింగ్ (7,172)లను అధిగమించాడు. స్వదేశంలో మాథ్యూస్ 44.00 సగటుతో 3,740 పరుగులు చేశాడు.
లంక గడ్డపై ఆరు సెంచరీలు బాదిన క్రికెటర్ గా మాథ్యూస్ నిలిచాడు.