అంబటి రాయుడు మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ : రాబిన్ ఉతప్ప
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్లలో మోస్ట్ అండర్ రేటెడ్ ఆటగాళ్ల జాబితా తయారు చేస్తే అందులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కచ్చితంగా ఉంటుంది.
తనకు ఎంతో అపారమైన ట్యాలెంట్ ఉన్న కూడా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్ మాత్రం ఎంతో అద్భుతంగా రాణించి ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ లు ఆడిన విషయం మనకు తెలిసిందే.
నేడు గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందే అంబటి రాయుడు కీలక విషయాన్ని వెల్లడించారు.
తాను ఇంకా ఐపీఎల్ ఆడబోనని, ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని మళ్లీ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనని స్పష్టం చేశాడు.
Details
అంబటి రాయుడు టాలెంటెడ్ ప్లేయర్
ఈ నేపథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాయుడు తెలివైన ఆటగాడు అని, రాయుడు భారత టెస్టు జట్టులో కూడా అతను ఆడించాల్సిందని, ఇలాంటి ఆటగాడికి కనీసం అవకాశం రాలేదని చెప్తుంటే ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని, క్రికెట్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి రాయుడు అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో రాయుడు ముంబైతో ఒకటి, చైన్నైతో నాలుగు కలిపి మొత్తం ఐదు ట్రోఫీలను సాధించాడు. అయితే ఈ సీజన్లో రాయుడు పెద్దగా రాణించడం లేదు. మొత్తం 11 మ్యాచుల్లో కేవలం 139 పరుగులు చేశాడు.
నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.