సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచేజీ ట్విట్టర్ వేదికగా గురువారం ట్విట్టర్ స్పష్టం చేసింది. వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడని, అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్లు ట్విట్ చేసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్రాంచేజీ ఆశిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర (3/28, 24 నాటౌట్) తో ఆల్ రౌండర్ ప్రదర్శన చేశాడు.
గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరం
తొలి 6 మ్యాచ్ ల్లో కనీసం ఒక వికెట్ కూడా తీయని సుందర్.. ఢిల్లీతో ఫామ్ తో అందుకోగానే గాయం నుండి జట్టుకు దూరం కావడం సన్ రైజర్స్ కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకూ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఇంకా ఎవరు రానున్నారో సన్ రైజర్స్ ప్రకటించలేదు. ఇక సుందర్ ని హైదరాబాద్ రూ.8. 75 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.