Anaya Bangar: అవగాహనతో మాట్లాడాలి.. కాప్ వ్యాఖ్యలకు అనయ బంగర్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అనుమతితో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) ఆడేందుకు అనయ బంగర్ సిద్ధమవుతోంది. అయితే ఆమెకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటర్ మరిజన్నె కాప్ ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు చేసింది. దీంతో అనయ బంగర్ క్రికెట్ ఆశలకు మరోసారి బ్రేక్ పడుతుందా? అనే చర్చ మొదలైంది. తాజాగా కాప్ వ్యాఖ్యలపై అనయ స్పందించింది. ఏదైనా అంశంపై అభిప్రాయం వ్యక్తం చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆమె సూచించింది.
వివరాలు
నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం ద్వారానే అనుమతి..
''క్రికెట్ ఆస్ట్రేలియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం ద్వారానే నాకు అనుమతి లభించింది.
నేను ఎలాంటి అన్యాయమైన ప్రయోజనం పొందడం లేదు.
ఈ విషయంపై మాట్లాడాలనుకునేవారు ముందుగా సరైన అవగాహన పెంచుకుని.. ఆ తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుంది.
నేను త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి క్లబ్ క్రికెట్‌లో నా సత్తా ఏంటో నిరూపించుకుంటా.
బిగ్‌బాష్ లీగ్‌లో చోటు దక్కించుకునేందుకు నా అవకాశాలను నేనే సృష్టించుకుంటా.
ఇప్పుడు నేను వేస్తున్నవి చిన్న అడుగులే కావచ్చు. కానీ క్రికెట్ ఆడేందుకు ఓ వేదిక ఉండాలనే నా కోరిక నెరవేరింది.
దాని కోసం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను'' అని అనయ బంగర్ పేర్కొంది.