Andrew Flintoff: సిడ్నీ థండర్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్.. త్వరలో అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లిన్టాఫ్ త్వరలో జరిగే బిగ్ బాష్ లీగ్ (BBL) కోసం సిడ్నీ థండర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట కోడ్ స్పోర్ట్స్ వెల్లడించింది. ట్రెవర్ బేలిస్ క్లబ్‌ను వీడిన తర్వాత కొత్త కోచ్ కోసం జరిగిన అన్వేషణలో ఫ్లింటాఫ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు 2019 వన్డే వరల్డ్ కప్ అందించిన మాజీ కోచ్ ట్రేవోర్ బేలిస్ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్‌తో కొనసాగారు. అయితే ఇటీవల సీజన్లలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో ఆయన క్లబ్‌కు గుడ్‌బై చెప్పారు.
వివరాలు
గత సీజన్లో ఆ జట్లకు కోచ్
గత ఏడాది నుంచి ఫ్లింటాఫ్ ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో యాషెస్ టూర్ కూడా జరిగింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచింగ్ అనుభవం విషయానికి వస్తే, 'ది హండ్రెడ్' టోర్నీలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు 2024, 2025 సీజన్లలో కోచ్‌గా పనిచేశారు. 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్‌తో ఒప్పందం కుదరకపోయినా, ఆయన కోచింగ్‌లో సూపర్‌చార్జర్స్ వరుసగా నాలుగో, మూడో స్థానాల్లో నిలిచింది.
వివరాలు
ఫ్లింటాఫ్‌కు బాధ్యతలు..
ఫ్లింటాఫ్‌కు బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2014-15 సీజన్‌లో ఆయన బ్రిస్బేన్ హీట్ తరఫున బరిలోకి దిగారు. హీట్ కోసం కేవలం ఏడు మ్యాచ్‌లే ఆడినా, దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో అవే ఆయన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్‌లు కావడం విశేషం. ఇప్పుడు సిడ్నీ థండర్‌తో విదేశీ ఫ్రాంచైజీ కోచ్‌గా తొలి బాధ్యతలు చేపట్టనున్న ఫ్లింటాఫ్‌కు ఈ అనుభవం ఉపయోగపడనుంది.
వివరాలు
కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తుపై నిర్ణయం..
ఇక సిడ్నీ థండర్ కొత్త కోచ్‌గా ఫ్లింటాఫ్ నియామకం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ముందున్న కీలక అంశాల్లో ఒకటి జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడం. ఏప్రిల్‌లో డ్రింక్ డ్రైవింగ్ కేసులో వార్నర్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. జూన్ 24న కోర్టులో కేసు విచారణకు రానుండగా, ఆయన తప్పును అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం రాబోయే BBL సీజన్‌లో సిడ్నీ థండర్ ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.