జోరుమీద ఉన్న చైన్నైసూపర్ కింగ్స్ మరో దెబ్బ.. స్టార్ పేసర్ దూరం
ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించి జోరు మీద ఉన్న చైన్నై సూపర్ కింగ్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముంబై మ్యాచ్‌లో గాయం కారణంగా బెన్ స్టోక్స్, మెయిన్ ఆలీ బరిలోకి దిగలేదు. అయితే మెయిన్ ఆలీ తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ గాయపడటంతో మరికొన్ని రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు దీపక్ చాహార్ తొడ కండరాలు పట్టేయడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. దీంతో ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానాన్ని వీడాడు.
గాయంతో ఐపీఎల్ కు దీపక్ చాహర్ దూరం
స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో దీపక్ చాహర్ కొన్ని రోజులు ఐపీఎల్ కు దూరం కానున్నాడు. దీపక్ చాహార్‌కి అయిన గాయం తీవ్రమైనదైతే అతను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుంది. లేదంటే కనీసం ఒకటి రెండు వారాలు ఆటకి దూరంగా ఉండే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చిన దీపక్ చాహార్, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయితే 4 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు ఇచ్చాడు.