ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం అన్నీ ఫ్రాంచేజీల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఐదుసార్లు ఛాంపియన్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ఇంతవరకు ఐపీఎల్‌లో ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్‌లో బెంగుళూరు చేతిలో ముంబై ఘోరంగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఇసాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచారు. నేటి మ్యాచ్ లో ఈ ముగ్గురు రాణిస్తే ముంబై విజయానికి తిరుగుండదు. తొలి మ్యాచ్‌లో అకట్టుకున్న తిలక్ వర్మ మరోసారి సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్‌ని బౌలింగ్ విభాగం దెబ్బతీస్తోంది. జోఫ్రా అర్చర్ రాణిస్తాడనుకుంటే బెంగుళూరు మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన విషయం తెలిసిందే.
సీఎస్కే పై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్
నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ ఓపెనర్ మ్యాచులు జరిగాయి. సీఎస్‌కేపై అత్యధికంగా 20 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబైపై సీఎస్కే 13 మ్యాచుల్లో నెగ్గింది. మరోవైపు చైన్నై జట్టులో ఓపెనర్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ రెండు హాఫ్ సెంచరీతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బెన్ స్టోక్స్, మెయిన్ అలీ, అంబటి రాయుడు భారీ ఇన్నింగ్స్ ఆడితే ముంబైకి కష్టాలు తప్పవు. బౌలింగ్ విభాగంలో రాజ్యవర్ధనే ఫర్వాలేదనించాడు. ఇక జడేజా, దీపక్ చాహర్ ఎలా రాణిస్తారో చూడాలి. దీంతో ఈసారి ఇరు జట్లలో పైచేయి ఎవరిది అవుతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు