IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే చైన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2023 మినీ వేలంలో అతన్ని సీఎస్కే కోటీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అతని స్థానలో దక్షిణాఫ్రికా పేసర్ సిసాండ మగళను జట్టులోకి తీసుకుంటున్నట్లు చైన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. మగళను రూ.50లక్షల కనీస ధరకు సీఎస్ కే సొంతం చేసుకుంది.
మగళాకు దేశవాలీ టీ20 క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 127 టీ20లు ఆడి మగళా.. 136 వికెట్లు పడగొట్టాడు.
జెమీసన్
గాయం కారణంగా జెమీసన్ దూరం
2021 సీజన్లో ఆడిన జెమీసన్ ని బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ 15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది అత్యధిక ధర పలికిన ఫారిన్ ప్లేయర్‌గా జెమీసన్ కు రికార్డు క్రియేట్ చేశారు. కానీ బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లో విఫలమై బెంగళూరు పెట్టుకున్న ఆశలను వమ్ముచేశాడు.
తొమ్మిది మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. దీంతో బెంగళూరు అతన్ని వదులుకుంది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1కోటికి కొనుగోలు చేసింది. సర్జరీ కారణంగా ఐపీఎల్‌కు జెమీసన్ దూరమైనట్లు సమాచారం.
సర్జరీ కారణంగా దాదాపు 4నెలలు క్రికెట్ కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.