Loading...
U20 Worlds javelin: జావెలిన్‌ త్రోలో భారత్‌కు మరో పతకం.. పదేళ్ల తర్వాత ఆశిశ్‌ యాదవ్‌ సంచలనం
జావెలిన్‌ త్రోలో భారత్‌కు మరో పతకం.. పదేళ్ల తర్వాత ఆశిశ్‌ యాదవ్‌ సంచలనం

U20 Worlds javelin: జావెలిన్‌ త్రోలో భారత్‌కు మరో పతకం.. పదేళ్ల తర్వాత ఆశిశ్‌ యాదవ్‌ సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ అథ్లెట్‌ ఆశిశ్‌ యాదవ్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో ఈ ఈవెంట్‌లో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు. దాదాపు పదేళ్ల క్రితం ఇదే యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పుడు ఆశిశ్‌ రజతం గెలవడంతో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో పతకం సాధించిన భారత అథ్లెట్ల జాబితాలో అతడూ చేరాడు. 19 ఏళ్ల ఆశిశ్‌ తీవ్ర పోటీ మధ్య మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్‌ హెడ్రిక్‌ హైమన్స్‌ 80.50 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

వివరాలు

మూడో ప్రయత్నంలో సీజన్‌ బెస్ట్

ఆశిశ్‌ యాదవ్‌ 74.09 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు.

డొమినికాకు చెందిన అడ్డిసన్‌ జేమ్స్‌ 73.89 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు.

ఆశిశ్‌ యాదవ్‌కు పోటీ ప్రారంభం నుంచే గట్టిగానే ఎదురైంది. తొలి రౌండ్‌లో అతడు 69.96 మీటర్లు విసిరాడు.

అయితే మూడో ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని 74.09 మీటర్ల దూరం నమోదు చేశాడు.

ఇది ఈ సీజన్‌లో అతడి అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై జూనియర్‌ స్థాయిలో ఆశిశ్‌ యాదవ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

ADVERTISEMENT