Loading...
Rishabh Pant: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రిషబ్ పంత్ రీఎంట్రీ మరింత ఆలస్యం!
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రిషబ్ పంత్ రీఎంట్రీ మరింత ఆలస్యం!

Rishabh Pant: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రిషబ్ పంత్ రీఎంట్రీ మరింత ఆలస్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్-ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పంత్.. శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో అనధికారిక టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. ఇరానీ కప్ సందర్భంగా రిషబ్ పంత్ పక్కటెముకల గాయానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పంత్ పునరావాసం పొందుతున్నాడు.

వివరాలు

రెండు టెస్టుల సిరీస్‌లోనూ  ఆడటంపై సందేహాలు

ఈ నేపథ్యంలో నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లోనూ అతడు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్-ఏతో జరగనున్న మూడో అనధికారిక టెస్టు కోసం పంత్ స్థానంలో యువ బ్యాటర్ తిలక్ వర్మను ఎంపిక చేశారు.

మరోవైపు భారత టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే ఉద్దేశంతో వీరిద్దరినీ భారత్-ఏ తరఫున ఆడించాలని భావిస్తున్నట్లు సమాచారం.

భారత్-ఏ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

వివరాలు

వికెట్ కీపింగ్ బాధ్యతలను ధ్రువ్ జురెల్ చేపట్టే అవకాశం

బుధవారం వరకు భారత వన్డే జట్టులో భాగంగా ఉన్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా తాజాగా భారత్-ఏ జట్టులో చేరాడు.

ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి రిషబ్ పంత్ పూర్తిస్థాయిలో కోలుకోకపోతే వికెట్ కీపింగ్ బాధ్యతలను ధ్రువ్ జురెల్ చేపట్టే అవకాశం ఉంది.

దీంతో పంత్ అందుబాటుపై టీమిండియా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT