Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజతం
చైనాలో జరుగుతున్న19వ ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది. గతంలో కంటే ఈసారి భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. తాజాగా పురుషుల కనోయ్ డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో భారత రజత పతకం సాధించింది. అర్జున్ సింగ్, సునీల్ సింగ్‌తో కూడిన భారత జట్టు 3:53.329 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో భారత్
ఉబ్బెకిస్తాన్ 3:43.796 సెకన్లలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ ను సొంతం చేసుకోగా, 3:49.991 సెకన్లలో రెండో స్థానంలో నిలిచిన కజికస్తాన్ కాంస్య పతకాన్ని సాధించింది. కనోయ్ 100 మీటర్ల విభాగంలో భారత్ రజత పతకం రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ భారత్ 61 మెడల్స్ సాధించి, వంద పతకాల వైపు దూసుకెళ్తుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్య, 24 రజతాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.