Page Loader
టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ నుండి వైదొలిగిన ఆంటోనియో కాంటే
పదవి నుండి తప్పుకున్న ఆంటోనియో కాంటే

టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ నుండి వైదొలిగిన ఆంటోనియో కాంటే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉన్నత స్థాయి నిర్వాహకులలో ఒకరైన హెడ్ కోచ్ ఆంటోనియో కాంటే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టోటెన్ హామ్ హాట్స్‌పుర్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. సోమవారం ఈ విషయాన్ని క్లబ్ అధికారిక ప్రకటన చేసింది. కాంటే 2021లో నునో ఎస్పిరిటో శాంటో స్థానంలో స్పర్స్‌లో చేరిన విషయం తెలిసిందే. గతంలో 18 నెలల ఒప్పందంపై సంతకం చేశాడు. అయితే ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదం కారణంగా తన పదవీకాలాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. గత సీజన్‌ ప్రీమియర్ లీగ్‌లో నాల్గవ స్థానంలో నిలిచేందుకు స్పర్స్‌ను కాంటే ముందుండి నడిపించాడు. అయితే క్లబ్‌తో అతనికి సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయి.

కాంటే

తీవ్ర ఆగ్రహానికి గురైన కాంటే

సౌతాంప్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పర్స్ 3-3తో డ్రా చేసుకున్న తర్వాత కాంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంటే నవంబర్ 2021లో నునో ఎస్పిరిటో శాంటో నుండి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుండి అతను 76 మ్యాచ్‌లలో స్పర్స్‌కు నాయకత్వం వహించాడు. ఇందులో 41 విజయాలు, 23 పరాజయాలు ఉన్నాయి. అతను గత సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించడంతో స్పర్స్ ఛాంపియన్స్ లీగ్‌కు కూడా అర్హత సాధించింది. స్పర్స్ చీఫ్, డేనియల్ లెవీ మిగిలిన సీజన్‌లో దృష్టి కేంద్రీకరించాలని ఆటగాళ్లను ప్రోత్సహించారు. తమకు 10 ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఛాంపియన్స్ లీగ్ స్థానం కోసం ఆటగాళ్లు పోరాటం చేయాలన్నారు.